సింగనమల మండలం కల్లుమడి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సూర్యకిరణాలు స్వామిని తాకాయి. దక్షిణాయనం అక్టోబర్ 20 నుంచి 31 వరకు ఉత్తరాయణం మార్చి 15 నుంచి 30 వరకు ఉదయం ఆరు గంటల నుంచి 7 గంటల లోపల కల్లుమడి గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారిపై సూర్యకిరణాలు పడతాయి. ఈసందర్బంగా పూజారి సుదర్శన శర్మగారు మాట్లాడుతూ ఈ గుడి శాలివాహన శకం 1435 సంవత్సరంలో ఏర్పడిన గుడిగా పేర్కొన్నారు.