కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సుకు సంబంధించి తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు లోని మిట్స్ కళాశాలలో ఆన్లైన్ లో పరీక్ష నిర్వహించామని ప్రిన్సిపల్ డా. సి. యువరాజ్ తెలిపారు. ఎన్సీటీఈఎల్, ఐఐటీ మద్రాసు సంయుక్త ఆధ్వర్యంలో స్వయం పేరుతో మూడు రోజుల పాటు కళాశాలలో పరీక్ష జరిగిందని ప్రిన్సిపల్ తెలిపారు. వివిధ పాఠ్యాంశాలకు సంబంధించి ఎన్పీటీఈఎల్ వారు వారానికి మూడు సార్లు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు.