తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 24 వరకు, రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 5 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 29 వరకు పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. అయితే షెడ్యూల్ ప్రకారం గడువు మంగళవారంతో ముగియగా, మరో అవకాశమిస్తూ గడువు పొడిగించారు.