కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్, పీబీ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించింది. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు మొదటి విడత కౌన్సెలింగ్ జరగనుంది. నేడు ఉదయం 8 గంటల నుంచి 25వ తేదీ సా.6 గంటల వరకు అభ్యర్థులు కాలేజీల వారీగా ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు.