రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లో ఈరోజు నుండి ఫేసియల్ రికగ్నైజేషన్ ద్వారా అటెండెన్స్ అమలు చేయనున్నారు. త్వరలోనే ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ లాంటి కోర్సులు చదివే విద్యార్థులకు సైతం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం విద్యార్థులు కాలేజీలకు రాకున్నా హాజరవుతున్నట్లు కళాశాలలు చూపుతున్నాయి. దీంతో ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అటెండెన్స్ తీసుకునే విధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కాగా, అధ్యాపకులకు కూడా ఇదే విధానం అమలు కానున్నట్లు సమాచారం.