తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్ కు ఫ్రీగా ఎంసెట్ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. డిసెంబర్ లో ఇంటర్ సిలబస్ పూర్తి చేసి, కాలేజీల్లోనే జనవరి, ఫిబ్రవరిలో కోచింగ్ ఇవ్వనున్నట్లు కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించి మెరిట్ విద్యార్థులను గుర్తిస్తారు. ప్రతి జిల్లాలో గ్రూప్ వారీగా 50 మంది బాలురు, 50 మంది బాలికలను సెలెక్ట్ చేసి, వారికి ఏప్రిల్, మేలో ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వనున్నారు. ఫ్రీ మెటీరియల్ కూడా ఇస్తారు.