ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఎంసెట్ తో పాటు జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వాలని ఇంటర్ విద్య కమిషనరేట్ భావిస్తోంది. ఇప్పటికే ఎంసెట్ శిక్షణపై నిర్ణయం తీసుకున్నారు. ఇక జేఈఈ, నీట్ శిక్షణ కూడా జనవరి నుంచి ప్రారంభించనున్నారు. రెసిడెన్షియల్ పద్ధతిలో ఇంటెన్సివ్ కోచింగ్ తో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నారు. జిల్లాకు ఒక కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. జనవరి నుంచి 2 నెలలు ఇంటర్ తో పాటు సమాంతరంగా ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఉంటుంది. ప్రవేశ పరీక్షలు నిర్వహించి, విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్ వార్షిక పరీక్షలు ముగిశాక ఏప్రిల్, మేలో జేఈఈ, నీట్, ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షలకు రెసిడెన్షియల్ ఇంటెన్సివ్ కోచింగ్ ప్రారంభిస్తారు