ఏపీలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు పొడిగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11 నుంచి 16 వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈ నెల 17న స్కూళ్లు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సెలవులను ఈ నెల 18 వరకు పొడిగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, ఉపాధ్యాయ సంఘాలు మంత్రి బొత్స సత్యనారాయణను కోరాయి. దీనిపై మంత్రి బొత్స సానుకూలంగా స్పందించారని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. దీంతో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.