ఏపీలోని దివ్యాంగులకు సివిల్స్ కోచింగ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగుల కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి సివిల్స్ తో పాటు జాతీయ స్థాయిలో అనేక పోటీ పరీక్షల్లో రాణించేలా శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీని ఎంపిక చేసినట్టు రాష్ట్ర మహిళా శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.