విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. 60 శాతం, అంతకంటే ఎక్కువ హాజరు శాతం ఉన్న విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించనుంది. సరైన కారణాలతో ఏ విద్యార్థికైనా 60 శాతం నుండి 75 శాతం వరకు హాజరు ఉంటే ప్రతిపాదనలు పంపాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించింది. అయితే విద్యార్థులు 10 రోజుల తక్కువ అటెండెన్స్ కు రూ.500, 15 రోజులకు రూ.1500, 15 రోజులు దాటితే రూ.2 వేలు ఫైన్ చెల్లించాలి.