తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, మినిమం టైం స్కేల్ లెక్చరర్ల వయసును కూడా పొడిగించింది. దీంతో రాష్ట్రంలో 3,722 మందికి ప్రయోజనం చేకూరనుంది. ఇటీవల పదవీవిరమణ పొందినవారిని కూడా తిరిగి తీసుకోనున్నారు.