ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఐడీబీఐ బ్యాంకు 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలకు ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు. సంబంధిత పనిలో రెండేళ్ల పనిఅనుభవం ఉండాలి. వయసు 21-30 ఏళ్లు ఉండాలి. నెలకు రూ.36 వేల నుంచి రూ.63 వేల వరకు జీతం చెల్లిస్తారు. ఆన్ లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, ప్రి రిక్రూట్ మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000. దరఖాస్తుకు ఫిబ్రవరి 28, 2023 లాస్ట్ డేట్. వెబ్ సైట్: https://www.idbibank.in/