తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల దరఖాస్తుల గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 5,204 ఉద్యోగాల కోసం 40,100 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేసి, మొత్తం 5,204 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.