రిటైర్మెంట్ పై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పందించారు. తన టెస్టు కెరీర్‌కు ముగింపు పలకాలని సెలెక్టర్లు నిర్ణయిస్తే 2024 వరకు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడతానని తెలిపాడు. '2024 వరకు ఆడతానని ఎప్పుడూ చెబుతుంటా. టెస్టుల్లో నా స్థానానికి అర్హుడిని కాదని సెలెక్టర్లు భావిస్తే, పరిమిత ఓవర్ల క్రికెట్‌పై పూర్తిగా దృష్టిసారిస్తా. పరుగులు సాధిస్తున్నంత కాలం నా స్థానాన్ని కాపాడుకోగలను అని అన్నాడు.