దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 363 పాయింట్ల లాభంతో 59,325 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 103 పాయింట్లు లాభపడి 17,407 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.39 దగ్గర కొనసాగుతోంది. టాటా స్టీల్, ఎంఅండ్‌ఎం, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఎల్అండ్‌టీ, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, మారుతీ, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.