గత కొన్నిరోజులుగా తగ్గుతూ వినియోగదారులకు ఊరటనిస్తున్న బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.51,600కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరిగి రూ.56,290గా కొనసాగుతోంది. మరోవైపు కేజీ వెండి ధర సైతం రూ. 1000 పెరిగి 70,200కు చేరింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇవే ధరలు అందుబాటులో ఉండనున్నాయి.