బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఉమేశ్ యాదవ్ 2 సిక్సులు కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఉమేశ్ యాదవ్ రవిశాస్త్రి, యువరాజ్ సింగ్ ల రికార్డును బ్రేక్ చేశాడు. వారిద్దరూ టెస్టుల్లో 22 సిక్సులు బాదగా, ఉమేశ్ 24 సిక్సులతో విరాట్ కోహ్లీ సరసన చేరాడు. ఇక వీరేంద్ర సెహ్వాగ్ 91 సిక్సులతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత ధోనీ(78), సచిన్(69), కపిల్ దేవ్(61) ఉన్నారు.