దేశవ్యాప్తంగా 2023-24లో వైద్య విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) మెడికల్ సీట్ల భర్తీకి ఆదివారం నీట్ ప్రవేశపరీక్ష జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా, డీఎన్బీ కోర్సులకు పరీక్ష నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 271 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. మార్చి 31వ తేదీలోపు ఫలితాలను వెల్లడించనున్నారు.