అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 525 పాయింట్ల లాభంతో 60,334 వద్ద, నిఫ్టీ 146 పాయింట్లు లాభపడి 17,740 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.79గా ఉంది. సెన్సెక్స్30 సూచీలో HCL టెక్, ఇన్ఫోసిస్, టైటన్, ఏషియన్ పెయింట్స్,TCSషేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్ మాత్రమే నష్టాల్లో కొనసాగుతోంది.