దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు 13 భాషల్లో రాత పరీక్షను మే 7న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) ప్రకటించింది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో ఏప్రిల్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://neet.nta.nic.in/ వెబ్ సైట్ చూడాలని అధికారులు సూచించారు.