ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక మార్కెట్ లోకిి అంబానీ కూల్ డ్రింక్...త్వరలోనే సాఫ్ట్ డ్రింక్

business |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2023, 08:25 PM

వ్యాపారంలోని అన్ని రంగాలలో దూసుకెళ్తున్న రిలయన్స్ తాజాగా సాఫ్ట్ డ్రింక్  రంగంలోనూ అడుగుపెట్టింది. సుమారు 40 ఏళ్ల క్రితం దేశీయ మార్కెట్లో ఒక వెలుగు వెలిగిన బ్రాండ్‌ను రీలాంఛ్ చేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. ఒకప్పటిక సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ కాంపాను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్  సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ కాంపాను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. మూడు రుచుల్లో ఇది అందుబాటులోకి రానుంది. కాంపా కోలా, కాంపా ఆరేంజ్, కాంపా లెమన్ రుచుల్లో ఈ డ్రింక్స్ లభించనున్నాయని రిలయన్స్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.


వేసవి ప్రారంభమైన క్రమంలో కూల్ డ్రింక్స్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకునే ఆ డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు ఈ కాంపా బ్రాండ్ సాఫ్ట్ డ్రింక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ కాంపా డ్రింక్స్ 200ఎం.ఎల్, 500 ఎం.ఎల్, 600 ఎం.ఎల్, 1 లీటర్, 2 లీటర్ల ప్యాకులు, బాటిళ్లలో ఇవి అందుబాటులో ఉంటాయని రిలయన్స్ ప్రకటనలో తెలిపింది. 200 ఎంఎల్ బాటిల ధరను రూ.10గా నిర్ణయించారు. 500 ఎంఎల్ బాటిల్‌కు ధర రూ.20గా పేర్కొన్నారు. ఈ డ్రింక్స్ ముందుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే విక్రయాలు మొదలు పెడతామని రిలయన్స్ తెలపడం గమనార్హం.


'కొత్త అవతారంలో కాంపాను తీసుకురావడం ద్వారా అన్ని జనరేషన్ల కన్జ్యూమర్లు దీనిని ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అలాగే బేవరేజ్ విభాగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని భావిస్తున్నాం. పాత తరం కుటుంబాలు అప్పటి కాంపా బ్రాండ్ జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. ఈ బ్రాండ్‌లో ఉన్న రుచులను మళ్లీ అనుభవిస్తారు. క్రిస్పీగా ఉండే రీఫ్రెసింగ్ టేస్టును యంగ్ జనరేషన్స్ అనుభూతి చెందుతాయి.' అని పేర్కొన్నారు ఆర్‌పీసీఎల్ ప్రతినిధి.


ఇదిలావుంటే భారత సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో 1980 సమయంలో కాంపా బ్రాండ్ హవా కొనసాగింది. ఏకచత్రాధిపత్యాన్ని కొనసాగించింది. అయితే 1990ల్లో విదేశీ సంస్థలైన పెప్సీ, కోకాకోలో భారత్‌లోకి అడుగుపెట్టాయి. దీంతో వాటి పోటీని కాంపా బ్రాండ్ తట్టుకోలేక కనుమరుగైపోయింది. గతేడాది ఆగస్టు , 2022లో రూ.22 కోట్లకు కాంపా బ్రాండ్‌ను ప్యూర్ డ్రింక్స్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీసు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది రిలయన్స్. అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికే రిలయన్స్‌కు రిటైల్ మార్కెట్ విస్తరించి ఉంది. దీంతో ఈ కాంపా బ్రాండ్‌తో పెప్సీ, కోకాకోలా వంటి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని రిలయన్స్ భావిస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com