ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి మరియా మృతిచెందారు. కమిన్స్ భారత పర్యటనలో ఉండగానే ఆయన తల్లి తీవ్ర అనారోగ్యానితి గురవ్వడంతో రెండు టెస్టు అనంతరం స్వదేశానికి వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు రెండు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో నేడు కన్నుమూశారు. కాగా, ఆమె మృతికి సంతాపంగా ఆస్ట్రేలియా ప్లేయర్లు నేడు నల్ల బాడ్జీలను ధరించనున్నారు.