షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే క్రోమియం షుగర్‌ను అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు గుండె కవాటాలు మూసుకుపోకుండా క్రోమియం నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలాగే ఉసిరి తరచుగా తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుంది. ఉసిరిలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. ఉసిరి రోజు మన డైట్‌లో చేర్చుకుంటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది.