ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ భారత్ లో మార్కెట్ ను విస్తరించాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వచ్చే ఏడాదిలో దాదాపు లక్షా 20 వేల ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కార్తీక్ నారాయణ్ తెలిపారు. ప్రత్యక్షంగా 40 వేలు, పరోక్షంగా 80 వేల ఉద్యోగాలను కల్పిస్తామని అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఉద్యోగాల సంఖ్య 3 లక్షలకు చేరే అవకాశం ఉందని తెలిపారు.