అంగన్వాడీ కేంద్రాలలో తక్కువ బరువున్న పిల్లలపై ప్రత్యెక శ్రద్ధ కనపరచాలని, వారికి అందించే పౌష్టికాహారం వారు సక్రమంగా తినే విధంగా అంగన్వాడి కార్యకర్తలు, వర్కర్లు భాద్యత వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అల్లూరి జిల్లా కలక్టరేట్ సమావేశమందిరంలో పాడేరు డివిజన్ ఫరిదిలోని ఐసిడిఎస్ అధికారులతో బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమంపై కలక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకోవాలని, వారు సరిగా ఆహారం తీసు కోక పొతే డాక్టర్ సలహాలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా మరీ తక్కువ బరువున్న పిల్లలలను పాడేరు ఆసుపత్రిలో గల పౌష్టికాహార పునరావాస కేంద్రానికి తరలించి పౌష్టికాహారం అందించాలన్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లల ఫోటోలు బరువు తెలియజేయాలని, 15 రోజుల పాటు వారిని ప్రత్యెకoగా పర్యవేక్షిస్తూ వారికి మెనూ ప్రకారం సమయానికి ఆహారం అందిస్తే తప్పనిసరిగా బరువు పెరగటంతో పాటు అనారోగ్య సమస్యలనుండి విముక్తులవుతారని కలక్టర్ వివరించారు. అందుకు అంగన్వాడి కార్యకర్త, వర్కర్ భాద్యత వహించాలని, సూపెర్వైజర్లు ఆయా కేంద్రాలపై ప్రత్యెక దృష్టి సారించి క్రమం తప్పకుండ సందర్శించాలని, వారి ఫోటోలు పంపాలని ఆదేశించారు. అదేవిధంగా అంగన్వాడి కేంద్రాల సందర్షణ ఫోటోలు పంపాలన్నారు. తల్లులతో సమావేశాలు నిర్వహించి వారికి అవగాహన కల్పించాలన్నారు. బరువు తక్కువున్న పిల్లల వివరాలతో ప్రత్యెక రిజిస్టర్ నిర్వహించి ప్రతి రోజు వారి వివరాలు ఆ రిజిస్టర్ లో నమోదు చేయాల ని, వారంలో వచ్చిన మార్పులను తెలియజేయాలని సూచించారు. తదుపరి వారం తిరిగి సమీక్ష నిర్వహిస్తానని, ఈ వారంలోగా సందర్శించిన కేంద్రాలలో ఫోటోలు తీసి సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. అదేవిధంగా అనీమియా తల్లులు, పిల్లలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని, కలక్టర్ ఆదేశించారు.