ఈ ఏడాది ఐపీఎల్ కు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జాయ్ రిచర్డ్ సన్ దూరమయ్యాడు. తుంటి గాయం కారణంగా రిచర్డ్ సన్ ఐపీఎల్ కు దూరమైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున రిచర్డ్ సన్ ఆడాల్సి ఉంది. కాగా, ఐపీఎల్ కు దూరమవ్వడం బాధగా ఉందని, త్వరగా కోలుకొని వచ్చే సీజన్ కు మెరుగైన ఆటగాడిగా వస్తానని రిచర్డ్ సన్ తెలిపాడు. రిచర్డ్ సన్ ఆస్ట్రేలియా తరపున 15 వన్డేలు, 18 టీ20లు, 3 టెస్టులు ఆడాడు.