తేనె, వెల్లుల్లి, గుమ్మడికాయ విత్తనాలు, దానిమ్మ పండ్లు, క్యారెట్ వంటి ఆహారం కడుపులోని పురుగులను తగ్గించడంలో తోడ్పడుతుంది. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పుదీనా రసం పరకడుపున తీసుకోవడం ద్వారా కడుపులో బద్దె పురుగులు, ఏలికపాము వంటివి బయటకుపోతాయి. నులిపురుగుల నిర్మూలన కోసం ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి. 1-2 ఏళ్ల పిల్లలు 200 మిల్లీ గ్రాముల మాత్రలు, ఆపైబడిన వారు 400 మిల్లీ గ్రాముల మాత్రను వేసుకొని బాగా నమలాలి.