గుమ్మడి గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. గుమ్మడికాయ గింజలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రోజూ ఒక చెంచా గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇలా చేస్తే గుండెకు సంబంధించిన అన్ని సమస్యలు అదుపులో ఉంటాయి. గుమ్మడి గింజల్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి.