అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 404 పాయింట్ల లాభంతో 58,039 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 17,097 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 22 పైసలు పుంజుకొని 82.54 దగ్గర ప్రారంభమైంది. TCS, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా షేర్లు అత్యధికంగా లాభపడుతున్న జాబితాలో ఉన్నాయి.