వేసవి కాలంతో పోలిస్తే.. శీతాకాలం మీ చర్మం పొడిగా ఉంటుంది. ఆ సీజన్‌లో వాడే మాయిశ్చరైజర్ కాస్త ఆయిలీగా, హెవీగా ఉంటుంది. అటువంటి మాయిశ్చరైజర్ ఈ కాలానికి సరిపోదు. మీ డెర్మటాలజిస్ట్‌ను కలిసి ఈ సీజన్‌కు సరిపడా క్రీమ్ వాడాలి. వేసవి స్కిన్ కేర్ రొటీన్‌లో ఏది మర్చిపోయినా.. మీ చర్మానికి సన్‌స్క్రీన్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. బయటికి వెళ్లేటప్పుడు మాత్రమే కాదు, ఇంట్లో ఉన్నప్పుడూ సన్‌స్క్రీన్ రాసుకోవడం మంచిది. ఇది చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షించడమే కాదు, స్కిన్‌ను తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.