ఈ కాలంలో ఎండ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. చర్మం నిర్జీవంగా మారుతుంది. మృత కణాల కారణంగా, చర్మం డల్‌గా కనిపిస్తుంది. ఇవి చర్మానికి పోషకాలు అందకుండా చేసి, చెమట గ్రంథుల్ని మూసుకుపోయేలా చేస్తాయి. దీంతో మొటిమలు, మచ్చలు.. వంటివి సమస్యలు వస్తాయ్. అందుకే చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం చాలా ముఖ్యం. స్నానం చేయడానికి ముందు ఎసెన్షియల్ నూనెతో చర్మాన్ని మసాజ్ చేసి, మీ చర్మతత్వానికి సరిపోయే న్యాచురల్ స్క్రబ్‌తో ఎక్స్‌ఫోలియేట్ చేయండి. కనీసం వారానికి రెండు సార్లైనా.. మీ చర్మాన్ని స్ర్కబ్ చేస్తే.. మృత కణాలు తొలగి ఫ్రెష్‌గా కనిపిస్తుంది. రోజుకు కనీసం మూడు సార్లు ఫేస్ వాష్ చేసుకుంటే.. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.