వేసవి కాలంలో ఎక్కువమంది ఇబ్బందిపడే సమస్య.. టాన్. కొన్ని సింపుల్ టిప్స్‌తో టాన్‌ను సులభంగా తొలగించుకోవచ్చు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి. వేసవికాలం స్టార్ట్ అయ్యింది. పది నిమిషాలు బయటకు వెళ్తేనే.. చర్మం నిర్జీవంగా, కాంతివిహీనంగా మారుతుంది. ఎండతాకిడికి లోనైన చర్మం బాగా ఎర్రబడి, మండుతుంటుంది. ఆ తర్వాత కమిలి నలుపురంగుకు మారుతుంటుంది. ఈ సమస్యనే టాన్ అంటారు. టాన్ కారణంగా ముఖం అందవిహీనంగా మారుతుంది. టాన్ వదిలించుకోవడానికి, ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవడానికి అమ్మాయిలు.. ఏవేవో క్రీమ్‌లు వాడుతూ ఉంటారు, ఫేషియల్స్, స్కిన్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. కొన్ని ప్రభావవంతమైన చిట్కాలతో ఇంట్లోనే మీ ముఖం, చేతులపై ఉన్న టాన్ చిటికెలో తొలగించుకోవచ్చు. ఆ న్యాచురల్ టిప్స్ ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
నిమ్మరసం న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. నిమ్మరసంతో మీ చర్మాన్ని తిరిగి కాంతివంతంగా మార్చుకోవచ్చు. టాన్ ఉన్న ప్రాంతాలో నిమ్మరసాన్ని డైరెక్ట్‌గా అప్లై చేయండి. దీన్ని 10 - 15 నిమిషాలపాటు ఆరనిచ్చి.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. టాన్ తొలగుతుంది.