ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి సోప్ బార్ వాడితే.. చర్మం కఠినంగా మారే అవకాశం ఉంది. మీ ముఖంపై చర్మం సున్నితంగా ఉంటుంది, సోప్‌తో శుభ్రం చేయడం వల్ల చర్మంపై చికాకు, దురద వంటి సమస్యలు ఎదురవుతాయి. చర్మానికి ఆమ్ల స్వభావం ఉంటుంది, కానీ సబ్బులలో ఆల్కలీన్ స్వభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ముఖానికి సబ్బు వాడటం వల్ల చర్మం pH సమతుల్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా, సోప్‌లో కఠినమైన రసాయనాలు ఉంటాయి, ఇవి చర్మంలో ఉండే సహజమైన తేమను తొలగిస్తాయి, పొడిగా, నిస్తేజంగా మారుస్తాయి. చర్మం ఎక్కువగా పొడిబారడం వల్ల.. ఫ్లాకీనెస్, బ్రేక్‌అవుట్స్ వచ్చే అవకాశం ఉంది.