చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతున్నారు. దంతాలు, చిగుళ్ల వ్యాధులు, ఎక్కువగా పచ్చి ఉల్లిపాయలు తినడం వంటివి నోటి దుర్వాసనకు కారణమవుతాయి. నివారణకు రోజుకు రెండుసార్లు గోరువెచ్చని త్రిఫల కాషాయాలతో నోరు పుక్కిలించుకోవాలి. అలాగే వేప కలిసిన టూత్ ఫౌడర్, పేస్ట్ తో పళ్లు తోముకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకి రెండుసార్లు బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలంటున్నారు. భోజనం చేసిన తర్వాత సోంపు తీసుకోవడంతో నోటి దుర్వాసన తగ్గుతుందంటున్నారు.