టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీపై 9వ తరగతి ప్రశ్నాపత్రంలో ఓ ప్రశ్న వచ్చింది. ఆసియాకప్ లో ఆప్గనిస్థాన్ జట్టుపై విరాట్ కోహ్లీ సెంచరీ సాధించిన ఫొటోని ఉంచి.. దీనిపై 100-120 పదాల్లో డిస్క్రిప్షన్ రాయాలని ఇంగ్లిష్ క్వశ్చన్ పేపర్ లో అడిగారు. ఈ ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో ఇది వైరల్ గా మారింది.