దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 126.76 పాయింట్లు లాభపడి 57,653.86 వద్ద, నిఫ్టీ 40.65 పాయింట్ల లాభంతో 16,985.70 దగ్గర స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.37గా నిలిచింది. మారుతీ, ITC, ఏషియన్ పెయింట్స్, HDFC టాటా స్టీల్, టైటాన్ షేర్లు లాభపడగా TCS, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్టెల్, ICICI బ్యాంకు, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి.