కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోకి సెల్ఫోన్లు తీసుకెళ్లేందుకు ఎవరికి అనుమతులు ఉండవని ఆలయ ఈవో వెంకటేశు తెలిపారు. కాణిపాకం కార్య నిర్వహణ అధికారి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి ఆమలు చేయనున్నట్లు బుధవారం చెప్పారు. ప్రస్తుతం ఆలయంలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది సెల్ఫోన్లు తమవెంట తీసుకెళ్తున్నారు.
దీంతో కొందరు భక్తులు ఆలయంలో విధులు నిర్వ హించే వారికి ఒక నిబంధన, భక్తులకు ఒక నిబంధనా అని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తిరుమల తరువాత జిల్లాలో కాణి పాక ఆలయం ప్రముఖ ప్రసిద్ధి దేవాలయంగా విరాజిల్లుతోందని, ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి ఆలయంలోకి ఎవరు సెల్ఫోన్లు తీసుకరాకూడదని ఆంక్షలు పెడు తున్నట్లు తెలిపారు.
ఆలయ అధికా రులు, సిబ్బంది, ఎవ్వరైనా ఆలయం లోపల ఫోన్ మాట్లాడుతు న్నట్లు సీసీ కెమెరాల్లో నమోదైతే రూ. 500 అపరాధం వేస్తామని తెలి పారు. ఆతర్వాత మళ్లీ ఆలయంలో సెల్ఫోన్లు ఉపయోగిస్తే శాఖాపర మైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.