దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.610 పెరిగి ప్రస్తుతం రూ.61,600గా ఉంది. కిలో వెండి ధర రూ.950 పెరిగి ప్రస్తుతం రూ.73,723 వద్ద కొనసాగుతోంది. అటు తెలుగు రాష్ట్రాల్లో పది గ్రాముల బంగారం ధర రూ.61,600 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.73,723 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,981.25 డాలర్లుగా ఉంది.