ఐపీఎల్-2023 సీజన్లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు అదరగొడుతోంది. శనివారం ముంబై ఇండియన్స్ (MI)పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 157/8 స్కోరు చేసింది. ఆ లక్ష్యాన్ని చెన్నై 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. చెన్నై జట్టులో రహానే (61), రుతురాజ్ గైక్వాడ్ (40), శివందూబే (28), అంబటి రాయుడు (20*) పరుగులతో రాణించారు.