దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దీంతో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో సంచరించే ప్రజలకు మాస్క్ తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. హర్యానాలో గడిచిన 24 గంటల్లో 407 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో వారంలో ఇద్దరు మృతిచెందారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa