పాప్ కార్న్ తినడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సేంద్రియ పద్ధతుల్లో పండించిన మొక్కజొన్నలతో చేసే పాప్ కార్న్ ఆరోగ్యానికి మేలు చేస్తుందట. పాప్ కార్న్ లోని కొన్ని రకాల పీచులు ధమనులలో పేరుకుపోయిన చెడు కొవ్వులను తొలగిస్తాయట. గుండెపోటును నివారిస్తాయట. మొక్కజొన్న మలబద్దకం సమస్యను పోగొడుతుంది. మొక్కజొన్న లోని పీచులు శరీరంలోని షుగర్ లెవెల్స్ ని కూడా నియంత్రిస్తాయి. పాప్ కార్న్ లో ఇనుము ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఊబకాయాన్ని వదిలించుకోవడానికి ఇది సహాయపడుతుంది.