ముంబై, కోల్ కతాకు జరిగిన మ్యాచ్ లో ముంబై ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఇరు జట్ల కెప్టెన్లకు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. కోల్ కతా ఇన్నింగ్స్ సమయంలో స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు రూ.12 లక్షలు జరిమానా విధించారు. అలాగే, నితీశ్ రాణా ఔటయినప్పుడు బౌలర్ షోకీన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో రాణా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు రిఫరీ ప్రకటించారు.