ఎండలు మండిపోతున్నాయి. ఈక్రమంలో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈ వేసవిలో జ్యూస్‌ల ద్వారా వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. వేసవిలో ఎక్కువగా సిట్రస్ జాతికి చెందిన పండ్లతో చేసే జ్యూస్ తీసుకోవడం మంచిది. నిమ్మ, నారింజ వంటి పండ్లతో చేసే జ్యూస్లు తీసుకోవాలి. వడదెబ్బ తగిలినా, బాగా నీరసపడినా వెంటనే ఒక గ్లాసు నిమ్మరసంలో కాస్త ఉప్పు, చక్కెరను కలిపి తాగించాలి.