అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 76 పాయింట్ల లాభంతో 59,987 దగ్గర, నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 17,731 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 2 పైసలు పుంజుకొని 81.99 దగ్గర ప్రారంభమైంది. టాటా మోటార్స్, నెస్లే ఇండియా, HCL టెక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.