దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో 59,750 దగ్గర, నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 17,657 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 3 పైసలు పుంజుకొని 82.14 దగ్గర ప్రారంభమైంది. HCL టెక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో, ఏషియన్ పెయింట్స్, టైటన్, సన్‌ఫార్మా, TCS షేర్లు లాభాల్లో ఉన్నాయి.