చక్కెర, బెల్లం రెండూ కూడా చెరకు రసం నుంచే తయారు చేస్తారు. అయితే, పంచదార కంటే బెల్లంతోనే ప్రయోజనమని నిపుణులు పేర్కొంటున్నారు. చక్కెరలో కేలరీలు మాత్రమే ఉంటే బెల్లంలో చాలా పోషకాలు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని చెబుతున్నారు. బెల్లం తింటే రోగ నిరోధక శక్తిని పెంచడం సహా ఉబ్బసం, దగ్గు, కామెర్లు, ఛాతీ నొప్పి వంటి వివిధ వ్యాధులు నయమవుతాయని పేర్కొంటున్నారు. జీర్ణశక్తి కూడా బలపడుతుందని అంటున్నారు.