తిరుమల శ్రీవారికి విదేశీ భక్తులు సమర్పించే విదేశీ కరెన్సీని బ్యాంక్‌లలో డిపాజిట్ చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది. సెక్షన్ 50 ప్రకారం టీటీడీకి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆలయ ఈవోకు సమాచారం ఇచ్చింది. కాగా, ఇటీవల విదేశీ కానుకల వ్యవహారంలో టీటీడీకి కేంద్రం రూ. 4. 31 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ అభ్యర్థనతో కేంద్రం సడలింపులు ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa