ఆర్థికమాంద్య భయాలతో అనేక సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈక్రమంలో ఓపెన్ సోర్స్ సొల్యూషన్ ప్రొవైడర్ రెడ్ హ్యాట్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యలో 4% మందిని తొలగించేందుకు సిద్ధమైంది. అంటే 760 మందికి ఉద్వాసన పలికింది. కాగా, నార్త్ కరోలినా ఆధారిత సాప్ట్వేర్ మేజర్ కంపెనీలో 19వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.