రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయం కారణంగా కేఎల్ రాహుల్ మిగతా టోర్నీకి దూరమయ్యాడు. ప్రస్తుతం తుంటి గాయం స్కానింగ్ కోసం రాహుల్ ముంబై వెళ్లాడు. స్కాన్ లో వచ్చిన ఫలితాన్ని బట్టి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడటంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాహుల్ NCAలో ట్రీట్ మెంట్ తీసుకోనున్నారని తెలుస్తోంది.