హైబీపీతో ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయి. వేరుశనగ, బాదం, వాల్‌నట్స్, జీడిపప్పు వంటివి తినడం వల్ల హైబీపీ ముప్పు నుంచి జాగ్రత్త పడొచ్చు. వీటిలో ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి, బీపీ, డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి. ముఖ్యంగా హైబీపీ ఉన్న వారు రోజూ గుప్పెడు నట్స్ తింటే దివ్యౌషధంలా పని చేస్తాయి.